By Anusha Rao On April 13th, 2020

రతన్ టాటా రాసినట్లుగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఒక మెసేజ్ లో మనుషులు చిత్తశుద్ధి మరియు పట్టుదలతో ప్రయత్నాలు చేయడం వలన COVID-19 సంక్షోభం వల్ల భారత ఆర్ధిక వ్యవస్థ పడిపోతుందని అంచనా వేస్తున్న నిపుణుల అభిప్రాయం తప్పు అవుతుంది అని ఉంది. ఆ మెసేజ్ లో ఆయన భారత దేశం COVID-19 ని ఓడించి తిరిగి పుంజుకుంటుంది అని నమ్మకం వ్యక్తం చేసాడు. కానీ, రతన్ టాటా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఆ మెసేజ్ ని తాను చెప్పలేదు మరియు రాయలేదు అని ధృవీకరించారు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్: https://twitter.com/RNTata2000/status/1248850442030907398


‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Originally published at Factly